Connect with us


హెచ్ పి గ్యాస్ గృహలక్ష్మి పథకం

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్,హెచ్ పి గ్యాస్ వారు తమ వినియోగదారులకోసం విన్నూత్నంగా “గృహలక్ష్మి పథకం”ను ఈరోజు గుంటూరులో పౌరసరఫరాల అధికారి చిట్టిబాబుగారు, విజయవాడ హెచ్ పి సి యల్ ఛీఫ్ రీజినల్ అధికారి అబిద్ ఖాదిరీగారి చేతులమీదుగా స్థానిక హెచ్ పి గ్యాస్ డీలర్ కృష్ణతులసి గ్యాస్ ఏజన్సీలో ప్రారంభించారు.ఈ పథకంలో సింగిల్ సిలిండర్ కనెక్షన్ కలిగియున్న తమ వినియోగదారులు తీసుకొను రెండవ సిలిండర్ (డిబిసి) పై మరియు క్రొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకొనువారికి ఒక స్క్రాచ్ కార్డ్ ఇస్తున్నారు.ఈ స్క్రాచ్ కార్డ్ పై ఒక ఉచిత బహుమతి డీలర్ చేత ఇవ్వబడుతుంది.

మరియు ఎలక్ట్రానిక్స్,గృహోపకరణాలలో మేటియైన విజయ్ డిజిటల్ వారు నెలవారి డ్రాలలో విజేతలకు మిక్సి లేదా వెట్ గ్రైండర్ బహుమతిగా ఇవ్వడంతోపాటు జనవరి 26,2018న జరిగే బంపర్ డ్రాలో నలుగురు విజేతలకు టివి/ఫ్రిజ్/వాషింగ్ మెషీన్/ఓవెన్ ఇవ్వబడతాయి.అలాగే వస్త్ర ప్రపంచంలో మరియు బంగారు ఆభరణాలలో మేటియైన సియంఆర్,ఎమ్వీఆర్ మాల్ వారిచే 55గ్రాముల బంగారం నెలవారి డ్రాలలో మరియు బంపర్ డ్రాలలో విజేతలకు ఇవ్వబడతాయని నిర్వాహకులు తెలిపారు.ఈ పథకం గుంటూరు మరియు ప్రకాశం జిల్లావాసులకు మాత్రమే అని గుంటూరు సేల్స్ ఏరియా హెచ్ పి సియల్ సీనియర్ సేల్స్ ఆఫీసర్ సురేష్ కుమార్ తెలిపారు.

Draw Type

Weekly

Start Date

18/11/2017

End Date

18/08/2019


Post Your Article

రిలెటెడ్