Connect with us

అధిక బరువు కంటి సమస్యలకు కారణమవుతుందని మీకు తెలుసా?

అధిక బరువు పెరిగితే చాలా అనారోగ్యసమస్యలు వస్తాయని తెలుసు. అదే అధిక బరువు కంటి సమస్యలకు కారణమవుతుందని మీకు తెలుసా? అయితే కాస్త జాగ్రత్తపడండి. 

శరీరంలో ప్రతీ భాగం, మెదడుతో అనుసంధానమై ఉంటుంది. అలాగే కంటిలో కూడా రెటీనా నుంచి మెదడుకు సంకేతాలు తీసుకెళ్లే ఆప్టిక్ నెర్వ్ ఉంటుంది. అది దెబ్బతినడం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యనే గ్లకోమా అంటారు. దీనికి ప్రధాన కారణం అధిక బరువే అని తేల్చారు నిపుణులు. ఈ సమస్య బయటకు ఏర్పడదు. కానీ మెల్లమెల్లగా కంటిచూపు దెబ్బతింటుంది. అందుకే శరీర బరువును ఎప్పటికప్పుడు నియంత్రించుకోవాలి. ఆలస్యంగా గుర్తిస్తే చూపు పూర్తిగా కోల్పోవాల్సి ఉంటుంది. గ్లకోమా కారణంగా చూపు కోల్పోతే తిరిగి పొందే అవకాశం ఉండదు. ముదురు ఆకుపచ్చ కూరగాయలు, తాజా పండ్లను డైట్‌లో భాగం చేసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.

Comments

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Post Your Article

రిలెటెడ్