Connect with us

దసరా ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు రూట్ మ్యాప్

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ దసరా ఉత్సవములు - 2018.....దసరా ఉత్సవములు తేది:10.10.2018 నుండి 18.10.2018 వరకు జరుగును. మొదటి రోజు స్నపనాభిషేకం అనంతరం ఉదయం 9 గం.లకు దర్శనము ప్రారంభించబడును. మిగిలిన రోజులు ఉదయం 3 గం. నుండి రాత్రి 11 వరకు శ్రీ అమ్మవారి దర్శనం లభించును. మూల నక్షత్రం రోజున ఉదయం ఉద యం 1 గం.ల నుండి రాత్రి 11 గం.ల వరకు దర్శనం లభించును.

దర్శనమునకు కొండ క్రింద వినాయక గుడి నుండి రెండు క్యూ లైన్లు నుండి అనుమతించబడును.కొండపైన ఓమ్ టర్నింగ్ నుండి 5 లైన్లు ఏర్పాటు చేయడమైనది. రధం సెంటరు మరియు మున్సిపల్ ఆఫీసు వద్ద చెప్పులను సామాన్లును భద్రపరచు కౌంటర్లు ఏర్పాటుచేయడమైనది.రధం సెంటరు నుండి అశోక స్తంభము ముందు భాగము నుండి టోల్ గేటు పై నుండి క్యూ మార్గము ఏర్పాటు చేయబడినది.వయో వృద్దులకు మరియు దివ్యాంగులకు ప్రత్యేక వాహనములను కొండ పైకి వెళ్ళుటకు రాజీవ్ గాంధీ పార్క్ వద్ద ఉచిత బస్సులు ఏర్పాటు మరియు రైల్వేస్టేషన్ , బస్టాండ్ నుండి దేవస్థానము వారు ఉచిత బస్సులు ఏర్పాటు చేయడమైనది.

భక్తుల సౌకర్యార్ధం 8 ప్రదేశములలో ప్రధమ చికిత్సా కేంద్రములు మరియు అంబులెన్స్ లు ఏర్పాటు. భక్తులకు క్యూ మార్గము నందు ఉచిత త్రాగు నీరు మరియు చంటిపిల్లలకు పాలు ఏర్పాటు. అత్యవసర సమయములో క్యూ లైన్ల నందు భక్తులకు సహాయము చేయుటకు స్వచ్చంద సేవకులు ఎల్లవేళలా అందుబాటులో ఉందురు. క్యూలైన్ల మార్గము నందు ప్రతి 5 మీటర్లకు ఒక అత్యవసర ద్వారము ఏర్పాటు. శ్రీ అమ్మవారి దర్శనాంతరం రెండు మార్గములు మహామండపము ద్వారా మరియు శివాలయం వద్ద రాయబార మండపం నుండి క్రిందకు మార్గములు ఏర్పాటు చేయడమైనది.

ప్రత్యేక లక్షకుంకుమార్చన రుసుము రూ.3000/- లు గా రెండు బ్యాచులు ఉదయం 7 గం.ల నుండి 9 గం.ల మరియు 10 గం.ల నుండి 12 గం.ల వరకు నిర్ణయించడమైనది విశేష చండీ హోమం రుసుము రూ.4000/- లుగా ఉదయం 8 గం.ల నుండి 12 గం.ల వరకు జరుగును. మూలనక్షత్రం రోజున రుసుము రూ.5000/- లు గా మూడు బ్యాచులు ఉదయం 7 గం. నుండి 9 గం.లవరకు, 10 గం.ల నుండి 12 గం.ల వరకు మరియు మధ్యాహ్నం 1 గం. నుండి 3 గం.ల వరకు నిర్ణయించడమైనది. ఉభయదాతలు టిక్కెట్లు ఉన్న వారు కొండ పైకి చేరుటకు రాజీవ్ గాంధీ పార్క్ , ఉండవల్లి, పున్నమి ఘాట్ నుండి ప్రత్యేకముగా వాహనములు ఏర్పాటు. మీడియా వారికి సీతమ్మవారి పాదాలు వద్ద రెండు వాహనములు ఏర్పాటు చేయడమైనది. ప్రజాప్రతినిధులు , అధికారులు, దాతలు నిమిత్తము మొదటి రోజు మధ్యాహ్నం 2 గం.ల నుండి 5 గం.ల వరకు మిగిలిన రోజులు ఉదయం 7 నుండి 11 వరకు మరలా మధ్యాహ్నం 2 గం.ల నుండి 5 గం.ల వరకు రూ.300/- టిక్కెట్టు పై ప్రత్యేక వాహనముల ద్వారా కొండపైకి చేర్చబడును.

మహామండపము ప్రక్కన ఉన్న ప్రదేశము నందు 22 గంటలు సాంస్కృతిక కార్యక్రమములు ఏర్పాటు. ప్రతి రోజు సాయంత్రం 4 గం.లకు నగరోత్సవము శివాలయం మెట్ల వద్ద నుండి ప్రారంభమగును. ఈ ఉత్సవము అర్జున వీది మార్గము, రధం సెంటర్, వినాయక టెంపుల్ మరలా రధం సెంటరు టోల్ గేటు మార్గము ద్వారా కొండ పైకి వెళ్ళునట్లు నిర్ణయించడమైనది. నగరోత్సవము నందు ప్రత్యేక ఆకర్షణగా బ్రహ్మ రధం, బేతాళ నృత్యం , తాళ భజనలు, సంకీర్తనలు, కోలాట బృందము, నృత్య బృందము, వేద విద్యార్దులు, శాక్సోఫోన్స్ వాయిద్యం, కేరళ వాయిద్యం, నయాండ వాయిద్యం, సన్నాయి, చండీశ్వరుడు చిన్న పల్లకి, తిరుచ్చి- స్వామివారు-అమ్మవార్మ పల్లకీ, వేదపండితులు, ఘాటాటోపం కార్యక్రమములు ఏర్పాటు చేయడమైనది. ప్రతిపాదిత రాజవీధి మార్గము ద్వారా వెళ్ళి కనకదుర్గ నగర్ నందు ప్రసాదము కౌంటర్లు ఏర్పాటు. అర్జున వీధి నందు దేవస్థానము వారు విచ్చేయు భక్తులకు ప్రతిరోజు ఉదయం 8.30 ని.ల నుండు సాయంత్రం 4 గంటల వరకు మరియు సాయంత్రం 5 గం.ల నుండి రాత్రి 9.30 ని.ల వరకు అన్నప్రసాదము ఏర్పాటు చేయడమైనది. భక్తులకు శ్రీ అమ్మవారి లడ్డు ప్రసాదము, భవానీ ప్రసాదము మరియు బంగీ ప్రసాదము అందుబాటులో ఉండును. భక్తులకు అందుబాటులో ఉండు విధముగా విజయవాడ బస్టాండు మరియు రైల్వే స్టేషన్ నందు ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు. సీతమ్మవారి పాదాలు వద్ద కేశఖండన శాల ఏర్పాటు. దేవస్థానమునకు చెందిన నాయిబ్రాహ్మణులు అందుబాటులో ఏర్పాటు. కేశఖండన శాల వద్ద షవర్సు ఏర్పాటు. సీతమ్మవారి పాదాలు వద్ద 30 , పద్మావతి ఘాట్ వద్ద 30, దోభి ఘాట్ వద్ద 20, దుర్గా ఘాట్ వద్ద 10 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు వివిధ దేవాలయముల నుండి సుమారుగా 300 మంది సిబ్బంది , 2000 మంది ఎన్.సి.సి., ఎన్.ఎస్.ఎస్. మరియు వాలంటీర్లు శ్రీ అమ్మవారి సేవలో అదనంగా వినియోగించబడుచున్నారు. దేవస్థానమునకు 24 గంటలు సమాచారము అందించుటకు టోల్ ఫ్రీ నెంబరు: 18004259099.

*దేవస్థానం వారి సమాచారం/వివరాల ప్రకారం.

Comments

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Post Your Article

రిలెటెడ్