Connect with us

అట్టహాసంగా హెచ్ పి గ్యాస్ వారి “ఆనంద గృహిణి”

 

తమ వినియోగదారులకు నాణ్యమైన,మెరుగైన సేవలందించడంలో ఎల్లప్పుడూ ముందండే హెచ్ పి గ్యాస్ వారు ఈ సంవత్సరం సరికొత్తగా “ఆనంద గృహిణి” పథకాన్ని వినాయకచవితినాడు ప్రారంభించారు.కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకునేవారికి,సింగిల్ సిలిండర్ కనెక్షన్ ఉన్నవారు రెండవ సిలిండర్ తీసుకునే విధంగా ప్రోత్సహించడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్టు హెచ్ పి గ్యాస్ సేల్స్ ఆఫీసర్ శ్రీ సురేష్ కుమార్ తెలిపారు.ఈ పథకం గుంటూరు మరియు ప్రకాశం జిల్లా వాసులకు మాత్రమే వర్తిస్తుందని ఆయన తెలిపారు.

గత సంవత్సరం 2017-18లో “గృహలక్ష్మి” పథకంను 17,000 మందికి పైగా ఉపయోగించుకున్నారనీ, ఆ స్ఫూర్తితో ఈ సంవత్సరం “ఆనంద గృహిణి” పథకాన్ని ప్రవేశపెట్టినట్టు, వినాయకచవితి నుండి సంక్రాంతి వరకు ఈ పథకం అమలులో ఉంటుందని,వినియోగదారుల ఆదరణ బట్టి పథకం మరికొంత కాలం పొడిగించే అవకాశం ఉందని తెలిపారు.ఈ పథకంలో ప్రతినెల డ్రా నిర్వహించడంతోపాటు,ఈ పథకం అమలు సమయంలో వచ్చే పండుగలప్పుడు డ్రాలతోపాటు, బంపర్ డ్రాలు నిర్వహిస్తామని మొత్తం మీద ₹15 లక్షల విలువైన బహుమతులు విజేతలు గెలుచుకోవచ్చని తెలిపారు.

వినియోగదారులకుపయోగపడే గృహోపకరణ వస్తువులతోపాటు హోండ యాక్టివాలను కూడా ఇవ్వనున్నామని...కావున అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవలసిందిగా ఆయన కోరారు.మరిన్ని వివరాల కోసం సమీప హెచ్ పి గ్యాస్ డీలర్లను సంప్రదించవలసిందిగా తెలిపారు.

Comments

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Post Your Article

రిలెటెడ్