Connect with us

అధునాతనంగా హెచ్ పి గ్యాస్ షోరూమ్స్

 

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ వారు దేశ వ్యాప్తంగా తమ హెచ్ పి గ్యాస్ షోరూమ్లను ఒకే విధంగా ఉండేట్టు అధునాతన పద్ధతిలో తీర్చిదిద్దుతున్నారు.ఫార్చ్యూన్ 500 కంపెనీలలో ఒకటైన తమ కంపెనీ షోరూమ్లన్నీ ఒకే విధంగా ఉండడం వలన తమ షోరూమ్ కు వచ్చే వినియోగదారులకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కలిగించినట్టుంటుందనీ హెచ్ పి గ్యాస్ విజయవాడ డిజిఎం శ్రీ అబిద్ ఖాద్రి తెలిపారు. 

 

ఇప్పటికే తమ హెచ్ పి గ్యాస్ విజయవాడ ఎల్పీజి ఆర్వో క్రింద అనేక షోరూమ్లను ఆధునీకరించామని డిసెంబరు 31,2018 నాటికి తమ పరిధిలోని డీలర్లందరూ నూరు శాతం ఆధునీకరిస్తారని ఆయన తెలిపారు.బాపట్లలో ఈరోజు ఆయన   శ్రీ తిరుమల గ్యాస్ & జనరల్ ట్రేడర్స్ షోరూమ్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయనతోపాటు డీలర్ సుబ్బారావుగారు,ఇతర డీలర్లు మరియు గుంటూరు జిల్లా సేల్స్ ఏరియా సేల్స్ ఆఫీసర్ శ్రీ సురేష్ కుమార్ గారు పాల్గొన్నారు.

 

ప్రారోంభవత్సవం సందర్భంగా పలువురు వినియోగదారులకు “ఆనంద గృహిణి” పథకం క్రింద నూతన గ్యాస్ కనెక్షన్లను అందజేసారు.

Comments

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Post Your Article

రిలెటెడ్