Connect with us

పలాసలో ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు

పలాసలో అధికారుల మెరుపు దాడులు శుక్రవారం కలకలం రేపాయి. జిఎస్‌టి కమిషనర్‌ శ్రీనివాసరావు (విజయనగరం) ఆదేశాల మేరకు, అసిస్టెంట్‌ కమిషనర్లు ఉమామహేశ్వరరావు, మోహనరావు (విజయనగరం) నేతృత్వంలో కాశీబుగ్గ అసిస్టెంట్‌ కమిషనర్‌ భానుమతి, సిబ్బందితో కలిసి పలాసలో మెరుపు దాడులు నిర్వహించారు. ఏక కాలంలో పవన్‌ కల్యాణ్‌ దాస్‌ గంగ్వాని ఇంటి పైనా , గోడౌన్‌పై దాడులు నిర్వహించారు. పలాసలోని జీడిపప్పు ట్రేడ్‌ వ్యాపారి పవన్‌ కల్యాణ్‌ గంగ్వాని ఇంటిపై జిఎస్‌టి దాడులు చేపట్టారు. పలాసలోని ఆయుష్‌ ట్రేడర్స్‌ గోడౌన్‌ పైనా దాడులు చేశారు. ప్రస్తుతం జీడిపప్పు కార్యాలయ బిల్లులను అధికారులు పరిశీలిస్తున్నారు.

Comments

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Post Your Article

రిలెటెడ్