Connect with us

మీ విలువైన ఆస్థి పత్రాలు ఇలా ఉంటే.. ఉన్నా లేనట్టే!

 

సర్టిఫికెట్లు, ఆస్తి పత్రాలు లాంటి విలువైనవి ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిది. మనలో చాలా మంది వాటిని మరింత భద్రంగా చూసుకోవాలనే కుతూహలంతో వాటిని లామినేట్ చేయించి.. అదేనండి సర్టిఫికెట్ నో లేక మరేదైనా డాక్యుమెంట్ నో కవర్లో పెట్టి ఒక మెషీన్ లో పెడితే అది కాస్తా గంజి పెట్టి ఇస్త్రీ చేసిన చొక్కాలా కొత్తగా, అట్టముక్కలా తయారవుతుంది. దాన్నే లామినేషన్ అంటారు. దాన్ని చూసి మురిసిపోయి జాగ్రత్తగా దాచుకుంటారు. మీరు కూడా ఏదో ఒక సందర్భంలో ఇలా లామినేట్ చేయించే ఉంటారు. అయితే మీకో సంఘటన గురించి చెప్పాలి. ఇది తెలుసుకున్నాక మీ కళ్ళు తెర్చుకోవాలని ఆశిస్తున్నాం. ఓ వ్యక్తి తన ఆస్తి కాగితాలను భద్రంగా దాచుకోవాలని కొన్నేళ్ల ముందు వాటికి లామినేట్ చేయించాడు. అదేనండి కవర్లో పెట్టి ఇస్త్రీ చేయించాడన్నమాట. అయితే మొన్నీమధ్య ఆ ఆస్తి పత్రాలను బ్యాంకులో తాకట్టు పెట్టి లోన్ తీసుకుందామనుకున్నాడు. లోన్ కి కావలసిన పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ఇక చివరి దశలో ఆస్తికి సంబంధించిన ఒరిజినల్ పత్రాలను కోరాడు బ్యాంకు మేనేజర్. సరే అని ఇతగాడు ఇస్త్రీ చేయించిన.. అదేనండి లామినేట్ చేయించిన పత్రాలను ఇవ్వబోయాడు. ఆ బ్యాంకు మేనేజర్ వాటిని పరిశీలించడం కాదు కదా... వాటిని చూడకుండానే మీకు లోన్ రాదూ అనేశాడు. ఇతగాడు షాక్ లోనుండి తేరుకొని అడగ్గా... ఆ బ్యాంకు మేనేజర్ ఇలా చెప్పాడు... లామినేట్ చేయించిన పత్రాలను మేము తీసుకోము. అవి ఒరిజినల్ డాక్యుమెంట్స్  అయినా కూడా మేము వాటిని స్వీకరించము. ఎందుకంటే... లామినేట్ చేసిన పత్రాలు ఒరిజినల్వా లేక కలర్ జీరాక్ చేయించి వాటిని లామినేట్ చేయించారా అనేది తేల్చడం అసాధ్యం. అందుకే మేము వాటి జోలికి పోము. ఇదివరకు ఇలాంటి లామినేట్ చేయించిన పత్రాల పై లోన్లు ఇచ్చి మా బ్యాంక్ ఎన్నో సార్లు మోసపోయింది. అందుకే ఇలాంటి పత్రాలు ఒరిజినల్ అయినా కూడా మేము సారీ చెప్పడం తప్ప ఇంకేం చేయలేము... మేము మాత్రమే కాదు..  మీరు ఏ బ్యాంకుకి వెళ్లినా ఇదే చెబుతారు. బ్యాంకుల చుట్టూ తిరిగి మీ సమయాన్ని వృధా చేసుకోడం మానేసి కావాలంటే ఈ పత్రాలను డీలామినేట్ చేయించి తీసుకురమ్మని సలహా ఇచ్చాడు. ఇక చేసేదేమిలేక డీలామినేట్ చేసే వారి గురించి ఆరా తీయడం మొదలెట్టారు. ఇక లోన్ రావడం అసాధ్యం... అసలు డీలామినేట్ అనేది ఉంటుందా అనే ఆలోచనలో పడ్డారు. వారినీ వీరిని అడగడం మొదలెట్టారు. ఇంటర్నెట్ సయాం కూడా తీసుకున్నారు. ఇలాంటివి పాకిస్తాన్ లో చేస్తారని తెలిసింది. కాని అక్కడికి వెళ్లడం కుదరని పని అని తెలిసిందే. బెంగుళూరు లో ఒకతను చేస్తాడని తెలిసింది. ఒక్కో పత్రానికి రూ. 3500 అవుతుందని చెప్పాడు. అంటే 20 పత్రాలకు రూ. 70 వేలు అవుతుందన్నమాట. అంత డబ్బు పెట్టలేని పరిస్థితి. చివరిగా మైసూర్ లో ఒక్కో పత్రానికి రూ. 500కే డీలామినేట్ చేస్తాడని తెలిసింది. ఇక చేసేదేమి లేక అక్కడికి వెళ్లి రూ. 10 వేలు అర్పించుకొని డీలామినేట్ చేయించుకున్నారు. లోన్ సంగతి పక్కకు పెడితే జీవితంలో ఇంకొసారి లామినేట్ జోలికి వెళ్లోద్దని జ్ఞానోదయం కలిగింది. కాబట్టి మీరు కూడా మీ సర్టిఫికెట్స్ ని, ఆస్తి పత్రాలని లేక ఇంకేమైనా విలువైన పత్రాలని లామినేట్ చేయించకండి. బ్యాంకు వారే కాదు మీ ఆస్తిని కొనుగోలు చేయాలనుకునే వారు కూడా దండం పెట్టి వెళ్ళిపోతారు. మీరు కూడా లామినేట్ చేసిన పత్రాలను స్వీకరించకండి. ఇదే కాదు ఎంతో మంది విద్యార్థులు లామినేట్ చేసిన సర్టిఫికెట్ లను ఇస్తున్నారని ఎన్నో వీసాలు రిజెక్ట్ చేస్తున్నారు. దయచేసి ఈ విషయాన్ని అందరికి షేర్ చేయండి. 

ఈ క్రింద లింక్ ను క్లిక్ చేసి “hamaracity” యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.మూవీ టికెట్స్, క్యాష్ రివార్డ్,రెస్టారెంట్ డిస్కౌంట్స్ మొదలైన ఆఫర్లు లక్కీ డ్రాలో గెలుచుకునే అవకాశం పొందండి

https://play.google.com/store/apps/details?id=com.vaisoft.hamaracity

Comments

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Post Your Article

రిలెటెడ్