Connect with us

రేపే హెచ్ పి గ్యాస్ ఆనందగృహిణి తొలి డ్రా

గత సంవత్సరం “గృహలక్ష్మి” పథకంతో మహిళలను విశేషంగా ఆకట్టుకున్న హెచ్ పి గ్యాస్ వారు ఈ సంవత్సరం “ఆనందగృహిణి” పథకంను గత నెల వినాయకచవితినాడు ప్రారంభించారు.గతంలో కంటే మెరుగ్గా,భిన్నంగా మహిళలను మరింత ఆకట్టుకునే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు.

6 నెలలపాటు జరిగే ఈ పథకంలో గుంటూరు,ప్రకాశం జిల్లాలలోని  హెచ్ పి గ్యాస్ డీలర్లు ప్రతి నెలా ఒక లక్కీ డ్రా నిర్వహిస్తారు.

అందులో గృహోపకరయోగమైన బహుమతులు విజేతలకు అందజేస్తారు.ఈ 6 నెలల కాలం మధ్యలో వచ్చే పండుగలనాడు డ్రాలు నిర్వహించి ₹10,000 విలువైన బహుమతిని ప్రతి పండుగకు విజేతకు అందజేస్తారు.స్కీం ఆఖరులో బంపర్ డ్రా నిర్వహించి 4 విజేతలకు హోండ యాక్టివాలను అందజేస్తారు.

ఇందులో భాగంగా రేపు అనగా అక్టోబరు 8న రెండు జిల్లాల హెచ్ పి గ్యాస్ డీలర్లు ఏకకాలంలో డ్రా తీసి విజేతలకు బహుమతులు అందజేస్తారు.

Comments

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Post Your Article

రిలెటెడ్