Connect with us

అఫిలియేషన్స్ రెన్యువల్‌పై డీఐఈవో సమావేశం...!!

2018-19 విద్యా సంవత్సరానికి అఫిలియేషన్స్ రెన్యువలను ఆన్‌లైన్‌లో చేసుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి బి.జయప్రదబాయి తెలిపారు. హైదరాబాద్ జిల్లాలోని ప్రైవేట్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్స్‌కు గన్‌ఫౌండ్రీలోని మహబూబియా గవర్నమెంట్ జూనియర్ కళాశాలల్లో గురువారం అఫిలియేషన్స్ రెన్యువల్‌పై డీఐఈవో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడు తూ అఫిలియేషన్ రుసుమును ఆన్‌లైన్‌లో అప రాధ రుసుము లేకుండా జనవరి 11వ తేదీ వరకు వివరాలను నమోదు చేయాలన్నారు.

బోధన సిబ్బంది వివరాలను ఈనెల 23లోపు సమర్పిం చాలని ప్రిన్సిపాల్స్‌కు సూచించారు. కాలేజీ హాస్టల్స్ అనుమతుల కోసం దరఖాస్తులు జనవరి 5 నుంచి ఆన్‌లైన్‌లో లభిస్తాయన్నారు. యా జమాన్యాలుwww.acad.tsbie.telangana.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించి దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఆన్‌లైన్ దరఖాస్తుతో పాటు ఎఫ్‌డీఆర్, భవనం, ఆటస్థలం రిజిస్ట్రర్డ్ లీజు డీడ్, ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్, శానిటరీ సర్టిఫికెట్, సక్ట్రురల్ సౌండ్‌నెస్ సర్టిఫికెట్లను జతపరచాలన్నారు.

Comments

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Post Your Article

రిలెటెడ్