Connect with us

రైతు నేస్తం పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో మిద్దె తోట (టెర్రస్ గార్డెన్)...!!

ఆధునిక జీవనం కొనసాగిస్తున్న నగర ప్రజలు ఆరోగ్యవంతమైన జీవనం సాగించాలంటే సేంద్రియ పద్ధ్దతుల్లో పండించిన ఆహార ఉత్పత్తుల వినియోగం పట్ల అవగాహన పెంచుకోవాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటాచక్రపాణి సూచించారు. ప్రముఖ వ్యవసాయరంగ పరిశోధకులు తుమ్మేటి రగోత్తమరెడ్డి రచించిన మిద్దె తోట (టెర్రస్ గార్డెన్) పుస్తకావిష్కరణ రెడ్‌హిల్స్ ఫ్యాప్సీలో రైతు నేస్తం పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఘంటాచక్రపాణి పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన తనకు ఆ రోజుల్లో వ్యవసాయంలో సేంద్రియ ఎరువులను వాడి ఆరోగ్యవంతమైన పంటలను పండించేవారని గుర్తు చేశారు.

మీడియా అకాడమీ చైర్మన్ అల్లంనారాయణ మాట్లాడుతూ చిన్నప్పుడు తన గ్రామంలో వ్యవసాయ పనుల్లో ఆసక్తిగా పాల్గొనేవాడినని గుర్తు చేశారు. నగర వాసులు ఉన్న కొద్ది పాటి స్థలాల్లో కూరగాయలు పండించుకొని ఆరోగ్యవంతమైన జీవనం సాగించేందుకు రగోత్తమరెడ్డి రచించిన పుస్తకాలు ఎంతో దోహదపడుతాయన్నారు. ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రిన్సిపాల్ మానుకొండ నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో రైతు నేస్తం పబ్లికేషన్స్ సంపాదకులు యడ్లపల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. 

Comments

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Post Your Article

రిలెటెడ్