Connect with us

 ఫ్రెండ్లీ పోలీసీంగ్‌ ద్వారా నిరుద్యోగులకు శిక్షణ...!!

రాబోవు పోలీసు పోస్టుల భర్తీ సందర్భంగా ఆశావాహులైన నిరుద్యో గులైన యువతీ, యువకులకు ప్రీ రిక్రూట్‌మెంట్ శిక్షణ ఇవ్వనున్నట్టు తూర్పు మండలం డీసీపీ శశిథర్‌రాజు తెలిపారు. కోఠి ఆంధ్రా బ్యాంక్ ఎదురుగా బస్సు టెర్మినస్ భవనంలో త్వరలో ఈ శిక్షణను ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. ఈ అవకాశాన్ని తూర్పు మండలం డీసీపీ జోన్ పరిధిలోని 18 సంవత్సరాల వయస్సు దాటిన యువతీ,యువకులు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. దీని కోసం స్థానిక యువత సుల్తాన్‌బజార్, చాదర్‌ఘాట్, అఫ్జల్‌గంజ్, నల్లకుంట, కాచిగూడ, ఉస్మానియ యూనివర్సిటీ, అంబర్‌పేట్, మలక్‌పేట్, సైదరాబాద్ పోలీసు స్టేషన్‌లలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.

ఈ శిక్షణను నిపుణుల సారథ్యంలో అందిస్తున్నామన్నారు. ఫ్రెండ్లీ పోలీసీంగ్‌లో భాగంగా ఈ శిక్షణతో నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగం సాధించ గలరనే భరోసా కల్పిస్తామని పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు. శిక్షణ తీసుకోవాల నుకునే అభ్యర్థులు సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్ 040-27854770, అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ 040-27854771 నెంబర్‌లలో సంప్రదించాలని వారు కోరారు.

Comments

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Post Your Article

రిలెటెడ్