Connect with us

అర్బన్ లంగ్స్ పేరుతో రిజర్వు ఫారెస్ట్‌ల అభివృద్ధి...!! 

నగర శివారుల్లోని రిజర్వు ఫారెస్ట్ బ్లాకులను అర్బన్‌లంగ్స్ స్పేస్‌లుగా తీర్చిదిద్దింది. ఇప్పటికే నారపల్లి (భాగ్యనగర నందనవనం), మేడిపల్లి, కండ్లకోయ రిజర్వు ఫారెస్ట్‌లను అభివృద్ధి చేసిన ప్రభుత్వం మరో 28 రిజర్వు ఫారెస్ట్‌లను అర్బన్ లంగ్స్ స్పేస్‌లుగా మార్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన మీడియా టూర్‌లో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ పీకే ఝా, అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆర్.కే.దోబ్రియల్, సీసీఎఫ్ చంద్రశేఖర్ రెడ్డి, డీఎఫ్‌ఓ సుధాకర్ రెడ్డి ఈ పార్కుల ప్రాముఖ్యతను మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో సీఎంఓ ఓఎస్‌డీ, హరితహారం స్పెషల్ ఆఫీసర్ ప్రియాంక వర్గీస్ తదితర అధికారులు పాల్గొన్నారు.

ఇందులో బ్యాంబూ గార్డెన్స్, రాసి/నక్షత్ర వనం, బట్టర్ ైఫ్లె గార్డెన్స్, కార్తీక వనం, నవగ్రహ వనం, సప్తర్ష్షివనం, సాక్రెడ్ ప్లాంట్స్, పవిత్ర వనం, హెర్బల్ గార్డెన్స్, థీమ్ పార్కు, అశోకవనం ప్రధానమైనవి. నారపల్లిలోని భాగ్యనగర నందనవనంలో సుమారు 200మీటర్ల పొడవు, కండ్లకోయ రిజర్వు ఫారెస్ట్‌లో 250మీటర్ల పొడవు ఏర్పాటు చేసిన కెనాపీ నడకమార్గం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నది.

భాగ్యనగర నందనవనంలోని జింకల పార్కుకు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంది. ఈ పార్కులను సందర్శించేందుకు చాలా తక్కువ ఫీజులను వసూలు చేస్తున్నామని, నెలకు రూ. 100, ప్రతిరోజు ఎంట్రీ ఫీజు రూ.15, చిన్న పిల్లలకు రూ.10 వసూలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. 

ఔటర్ రింగ్‌రోడ్డుకు లోపల, వెలుపల సుమా రు 85 రిజర్వు ఫారెస్ట్‌లను అర్బన్ లంగ్స్ స్పేస్‌లుగా మార్చుతున్నామని అధికారులు వెల్లడించారు. హెచ్‌ఎండీఏ పరిధిలో 194 రిజర్వు ఫారెస్ట్‌లను సుమారు 1.50లక్షల ఎకరాలను పార్కులుగా అభివృద్ధి చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Comments

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Post Your Article

రిలెటెడ్