Connect with us

జిల్లాలో ఆర్‌బీఎస్‌కే అమలు...!!

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రాథమిక వైద్యాన్ని అందించేందుకు రంగం సిద్ధమైంది. 28 బృందాలు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను చుట్టేసి పిల్లలకు 30 రకాల వైద్యపరీక్షలను నిర్వహించబోతున్నాయి. రాష్ట్రీయ బాల స్వాస్థ కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కే) కింద పిల్లలకు ఈ తరహా వైద్య పరీక్షలను నిర్వహించనున్నారు. జిల్లాలో ఆర్‌బీఎస్‌కేను అమలుచేస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం జిల్లాలో 28 మ్బైల్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మైబెల్ వాహనాలు నేరుగాఆ జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలు, అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లనున్నాయి. అక్కడున్న పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి, వారికవసరమయ్యే మందులకు అందజేస్తారు. మొత్తం 30 రకాల వ్యాధులను ముందే పసిగట్టేలా పరికరాలను మ్బైల్ వాహనాల్లో అందుబాటులో ఉంచారు.

జిల్లాలోని 14 క్లస్టర్ల పరిధిలో ఆర్‌బీఎస్‌కే బృందాలను సేవలందించనున్నాయి. ఇందుకోసం 56 మంది వైద్యులు, 28 మంది ఏఎన్‌ఎంలు, మరో 28 మంది ఫార్మాసిస్ట్‌లను సేవలందిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రంలోని పిల్లలందరికి ఆరోగ్య పరీక్షలను నిర్వహిస్తామని ఆర్‌బీఎస్‌కే కో ఆర్డినేటర్ శ్రీకళ తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యా, వైద్యశాఖాధికారులు, సీడీపీవోలకు కార్యక్రమ నిర్వహణపై శిక్షణనిచ్చారు. కార్యక్రమంలో మహిళా,శిశు, వృద్ధుల సంక్షేమశాఖ పీడీ జీకే సునంద, డిప్యూటీ ఈవోలు సురేష్‌కుమార్, యాదయ్య, శామ్యూల్‌రాజ్, రవికుమార్, రాధాకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Comments

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Post Your Article

రిలెటెడ్