Connect with us

 అయ్యప్ప సొసైటీ అండర్‌పాస్ ప్రారంభం...!! 

ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు సుమారు రూ. 22వేలకోట్లతో ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టు చేపట్టిన విషయం విదితమే. ఈ పనుల్లో తొలిఫలం నేటి నుంచి నగరవాసులకు అందుబాటులోకి రానుంది. అయ్యప్ప సొసైటీ వద్ద నిర్మించిన అండర్‌పాస్‌ను నేడు మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ సంవత్సరం మార్చి వరకు ఈ పనులు పూర్తిచేసేందుకు గడువున్నా ముందుగానే నిర్మాణం పూర్తిచేశారు. భవిష్యత్ అవసరాలు కూడా దృష్టిలో ఉంచుకొని నిర్మించిన ఈ అండర్‌పాస్‌తో అయ్యప్ప సొసైటీ-కొండాపూర్ మార్గంలో ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి. మిగతా చోట్ల కూడా మల్టీలెవల్ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం యేడాదిలో పూర్తి చేసి, రెండోదశ పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 

దీంతోపాటు మిగిలిన ఏడు జంక్షన్లలో పనులు దశలవారీగా పూర్తిచేసి వచ్చే ఏడాది డిసెంబర్‌నాటికి పూర్తిచేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధంచేశారు. అంతేకాకుండా ఎస్‌ఆర్‌డీపీ రెండో దశలో భాగంగా మరో రూ. 7వేల కోట్లతో ఆరు ప్రాజెక్టులు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మొదటిదశలో ఎల్బీనగర్, కామినేని, చిలకలగూడ, బైరామల్‌గూడ, బయోడైవర్సిటీ, మైండ్‌స్పేస్, అయ్యప్ప సొసైటీ, రాజీవ్‌గాంధీ విగ్రహం తదితర ఎనిమిది జంక్షన్లలో రూ. 896కోట్ల వ్యయంతో మల్టీలెవల్ ఫ్లైఓవర్లు/గ్రేడ్ సెపరేటర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణంతోపాటు రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టారు. మిగిలిన జంక్షన్లలో మైండ్‌స్పేస్ వద్ద అండర్‌పాస్ వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తికానుండగా, జూన్‌లోగా అదే జంక్షన్‌లో ఫ్లైఓవర్‌ను సిద్ధంచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే, కామినేని జంక్షన్ ఫ్లైఓవర్ సైతం జూన్‌లో పూర్తిచేయాలని, మార్చినాటికి చింతలకుంట అండర్‌పాస్‌ను సిద్ధంచేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రణాళికాబద్ధంగా పనులు కొనసాగిస్తున్నారు. 

Comments

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Post Your Article

రిలెటెడ్