Connect with us

అమెరికాలో సత్తా చాటుతున్న ‘అరవింద సమేత’

యంగ్‌ టైగర్‌’ ఎన్టీఆర్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. ఆయన కథానాయకుడుగా నటించిన ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో విశేష ఆదరణ పొందుతోంది. ఇప్పటికే అడ్వాన్స్‌‌ బుకింగ్‌ భారీ స్థాయిలో జరిగింది. అమెరికాలోనూ ‘వీర రాఘవ’ సత్తాచాటుతున్నాడు. అక్కడ మొత్తం 194 ప్రాంతాల్లో విడుదలైంది.

అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ చిత్రం 707,698 డాలర్ల వసూళ్లు రాబట్టి తారక్‌ నటించిన ‘జైలవకుశ’ సినిమాను బీట్‌ చేసినట్లు సినీ విశ్లేషకులు అంచనా వేశారు. ‘జైలవకుశ’ అమెరికాలో తొలి రోజు 589,219 డాలర్లు రాబట్టింది. ఇక ‘జనతా గ్యారేజ్‌’ 584,000 డాలర్లు రాబట్టింది. తారక్‌ కెరీర్‌లో అమెరికాలో ఇంత స్థాయిలో వసూళ్లు రాబట్టిన తొలి చిత్రం ‘అరవింద సమేత’ అని విశ్లేషకులు అంటున్నారు. మరి ఎన్ని రోజుల్లో ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరుతుందో వేచి చూడాలి. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడీగా పూజా హెగ్డే నటించారు. హారిక-హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఎస్‌.రాధాకృష్ణ నిర్మించారు.

Comments

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Post Your Article

రిలెటెడ్