Connect with us

శశికుమార్ తో మడోనా జోడీ

‘నాడోడిగల్‌’ విజయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శశికుమార్‌.. ఆ తర్వాత ‘సుందరపాండియన్‌’తో అలరించారు. తర్వాత ఆ స్థాయి విజయం కోసం ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా ‘సుందరపాండియన్‌’ దర్శకుడు ఎస్‌.ఆర్‌.ప్రభాకరన్‌ దర్శకత్వంలో మళ్లీ నటించనున్నారు. ఈ చిత్రానికి ‘కొంబు వెచ్చ సింగండా’ అని పేరు పెట్టారు. టైటిల్‌ పోస్టర్‌ను సూర్య ఆవిష్కరించారు. ఇందులో కథానాయికగా మడోనా సెబాస్టియన్‌ను ఎంపిక చేశారు. తొలిసారిగా వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ఇది. ఇటీవల విజయ్‌ సేతుపతి హీరోగా నటించిన ‘జూంగా’ చిత్రంలో తెలుగమ్మాయిగా మెప్పించిన మడోనా.. ఇందులో భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. ఇదిలా ఉండగా కన్నడలో ‘కొట్టిగోపాలు 2’ చిత్రంలోనూ నటిస్తోంది మడోనా.

Comments

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Post Your Article

రిలెటెడ్