Connect with us

నానా పటేకర్కు షాకిచ్చిన అక్షయ్

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ నటుడు నానా పటేకర్‌కు తన నిర్ణయంతో షాకిచ్చారు అక్షయ్‌ కుమార్‌. అక్షయ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘హౌస్‌ఫుల్‌ 4’. ఇందులో నానా పటేకర్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. కానీ కొన్ని రోజులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నానాతో కలిసి తాను పనిచేయనని, ఆయన కేసు విచారణ పూర్తయ్యేవరకూ చిత్రీకరణ నిలిపివేయాలని అక్షయ్‌ చిత్రబృందాన్ని కోరారు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు.

‘గురువారం రాత్రి నేను ముంబయి చేరుకున్నాను. రాగానే లైంగిక వేధింపుల గురించి వస్తున్న వార్తలను చదివాను. అవి నన్ను చాలా బాధించాయి. విచారణ పూర్తయ్యేవరకు ‘హౌస్‌ఫుల్‌ 4’ చిత్రీకరణ నిలిపివేయాలని నిర్మాతలను కోరాను. ఎందుకంటే ఇది చూసీచూడనట్లు వదిలేసే విషయం కాదు. తప్పు ఉందని తెలిస్తే కఠిన చర్యలు తీసుకోక తప్పదు. నిందితులతో కలిసి పనిచేసే ఉద్దేశం నాకు లేదు. ఎవరైతే వేధింపులకు గురయ్యామని చెప్తున్నారో వారి వాదనలు విని, వారికి సరైన న్యాయం జరగాలన్నది నా అభిప్రాయం’ అని వెల్లడించారు.

పదేళ్ల క్రితం తనను లైంగికంగా వేధించాడంటూ సినీ నటి తనుశ్రీ దత్తా నానాపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పరస్పరం ఇద్దరూ నోటీసులు జారీ చేసుకున్నారు. నానాపై కేసు పెట్టడంతో పాటు తనుశ్రీ మహారాష్ట్ర మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ కేసు విషయమై పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కమిషన్‌ నానాకు నోటీసులు పంపింది. అంతేకాదు ‘హౌస్‌ఫుల్‌ 4’ దర్శకుడు సాజిద్‌ ఖాన్‌పై కూడా ఆరోపణలు వస్తున్నాయి. దాంతో ఆయన సినిమా నుంచి తప్పుకొన్నారు.

Comments

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Post Your Article

రిలెటెడ్