Connect with us

ఐరాలో నయన్ ద్విపాత్రభినయం

మహిళా ప్రాధాన్యత చిత్రాల్లో వరుసగా నటించి ‘లేడీ సూపర్‌స్టార్‌’గా గుర్తింపు తెచ్చుకున్నారు నయనతార. ఇటీవల ఆమె నటించిన ‘అరం’ కమర్షియల్‌గానూ మంచి విజయాన్ని సాధించింది. తాజాగా వచ్చిన ‘కోలమావు కోకిల’ నటన పరంగా ఆకట్టుకుంది. దీంతో ఆమె వరుసగా మహిళా ప్రాధాన్యత చిత్రాలనే ఎంచుకొంటున్నారు. అందులో భాగంగా ఆమె కొత్త సినిమాలో ద్విపాత్రాభినయం పోషించనున్నారు. ‘అరం’ చిత్రాన్ని నిర్మించిన కేజేఆర్‌ స్టూడియోస్‌ బ్యానరుపై జె.రాజేష్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. లక్ష్మీ, మా వంటి లఘు చిత్రాలను తెరకెక్కించిన సర్జున్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మాటలు, కథ కూడా ఆయనే రాశారు. కేఎస్‌ సుందరమూర్తి సంగీతం సమకూర్చుతున్నారు. ఇందులో నయనతార తొలిసారిగా ద్విపాత్రాభినయం పోషిస్తున్నారు. కలైయరసన్‌, యోగిబాబు, జేపీలు ఇతర తారాగణం. ఈ సినిమా గురించి నిర్మాత జె.రాజేష్‌ మాట్లాడుతూ ‘నయనతారతో రెండో సినిమాను తెరకెక్కించడం ఆనందంగా ఉంది. ‘అరం’ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. ‘ఐరా’ చిత్రం మా సంస్థకు మరింత గొప్ప పేరును తీసుకొస్తుంది. సర్జున్‌ కథ చెప్పేటప్పుడు ఇది మంచి సవాలైన సినిమా అని నయనతార చెప్పారు. ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటుంది. ‘ఐరా’ అంటే ఏనుగు అని అర్థం. ఏనుగంత బలమున్న పాత్ర ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. హర్రర్‌, థ్రిల్లర్‌ కథాంశంతో దీన్ని రూపొందిస్తున్నామని’ పేర్కొన్నారు.

Comments

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Post Your Article

రిలెటెడ్