Connect with us

యన్టిఆర్’లో-హరికృష్ణ పాత్ర

తెలుగువారి అభిమాన నటుడు నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యన్‌టిఆర్‌’. నందమూరి బాలకృష్ణ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాలోని ఒక్కో పాత్రను చిత్ర బృందం అభిమానులకు పరిచయం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఓ పాత్రకు సంబంధించి చిత్ర వర్గాల్లో తీవ్ర చర్చ జరిగింది. అదే ఎన్టీఆర్‌ తనయుడు నందమూరి హరికృష్ణ పాత్ర. ఆ పాత్రను ఇప్పుడు హరికృష్ణ తనయుడు నందమూరి కల్యాణ్‌రామ్‌ పోషిస్తున్నారు. సినిమాలో తన పాత్రకు సంబంధించిన ఫొటోను కల్యాణ్‌రామ్‌ అభిమానులతో పంచుకున్నారు.

‘‘30 ఏళ్ల క్రితం మా బాబాయ్‌తో ‘బాలగోపాలుడు’ సినిమాలో బాలుడిలా నటించాను. మళ్లీ ఇప్పుడు.. బాబాయ్.. వాళ్ల నాన్న గారిలా... నేను, మా నాన్నగారిలా’’ అంటూ ప్రచారం రథం దగ్గర ఎన్టీఆర్‌(బాలకృష్ణ)తో కలిసి వెనక్కి తిరిగి ఉన్న ఫొటోను ట్వీట్‌ చేశారు.నటుడిగా తన తండ్రి ఎన్టీఆర్‌తో కలిసి వెండితెరను పంచుకోవడమే కాదు, ఎన్నికల ప్రచార రథ సారథిగా హరికృష్ణ ఆయన వెన్నంటే ఉండి ఎన్నో వేల కి.మీ. ప్రయాణం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన పాత్రను ఎవరు చేస్తారా? అన్నదానిపై చాలా చర్చ జరిగింది. మొదట ఎన్టీఆర్‌ పేరు వినిపించినా, ఆ తర్వాత కల్యాణ్‌రామ్‌ పేరు బయటకు వచ్చింది. అయితే, ఎక్కడా దీనిపై స్పష్టత లేదు. అయితే, గత నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ ఘటన ఎన్టీఆర్‌ కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. అయితే, అప్పటికే కల్యాణ్‌రామ్‌ తన తండ్రి పాత్రలో నటించడానికి సుముఖంగా ఉన్నట్లు ప్రచారం జరిగినా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పుడు కల్యాణ్‌రామ్‌ ట్వీట్‌తో ‘యన్‌టిఆర్‌’లో హరికృష్ణ ఎవరన్న దానికి సమాధానం లభించేసింది.

Comments

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Post Your Article

రిలెటెడ్