Connect with us

‘సైరా’-విజయ్సేతుపతి గెటప్

‘మెగాస్టార్‌’ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘సైరా’. ఇటీవల విడుదలైన టీజర్‌ అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుటోంది. ఈ సినిమా కోసం తమిళ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విజయ్‌సేతుపతి వంటి పలువురు నటులు నటిస్తుండటంతో దీనిపై ఆసక్తి పెరిగింది. చిరంజీవి, విజయ్‌సేతుపతి, సుదీప్‌లకు సంబంధించిన సన్నివేశాలను జార్జియాలో చిత్రీకరిస్తున్నారు. ఇటీవలే విజయ్‌ సేతుపతి జార్జియా వెళ్లారు. ఈ నేపథ్యంలో ‘సైరా’ సినిమాకు సంబంధించిన విజయ్‌సేతుపతి, సుదీప్‌ల ఫొటో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. దీనిని వీక్షించిన విజయ్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరో తెలుగులో కూడా గుర్తింపు తెచ్చుకుంటారని అనుకుంటున్నారు. ఒబాయా అనే పాత్రలో ఆయన నటిస్తున్నట్లు సమాచారం.

Comments

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Post Your Article

రిలెటెడ్