Connect with us

ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ క్రీడలకు వేదిక కానుంది - మంత్రి కోల్లు రవీంద్ర

గుంటూరు(10.10.18)  :-  రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి నేతృత్వంలో అంతర్జాతీయ క్రీడలను  ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించే విధంగా అంతర్జాతీయ క్రీడామైదానాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాలికలను చేపట్టినట్లు రాష్ట్ర క్రీడ శాఖమంత్రి కోల్లు రవీంద్ర పేర్కొన్నారు. గత రెండురోజుల నుండి స్థానిక గుంటూరులోని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న ఆల్ఇండియా బాడ్మింటన్(అండర్-13) టోర్నమెంట్  లో గురువారం నుండి మొదలు కానున్న మెయిన్ డ్రా ను ప్రారంభించటానికి ఆయన ముఖ్యఅతిదిగా వచ్చి అక్కడ గల క్రీడాకారులను,కోచ్ లను కరచాలనం చేసి మెయిన్ డ్రా మ్యాచ్ లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్ర్రి కోల్లు రవీంద్ర స్థానిక ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, saap చైర్మన్ అంకమ్మ చౌదరి, రాయపాటి రంగారావు కొంతసేపు షటిల్ బాడ్మింటన్ ఆటను ఆడి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా మంత్రి కోల్లు రవీంద్ర మాట్లాడతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీచంద్రబాబునాయుడు గారు క్రీడలకు ఒక ప్రత్యేక స్థానాన్ని  ఏర్పాటు చేస్తున్నారని అందులో భాగంగా క్రీడల అభివృధి కోసం ప్రతి ఒక నియోజకవర్గానికి 2నుండి 2.5 కోట్ల నిధులతో క్రీడామైదానాలను ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్జీ,ఎన్.ఆర్.ఈ.జీ.ఎస్ సంయుక్త నిధుల కలయికతో ప్రతి ఒక్కమండలానికి 25లక్షల నిధుల అంచనా వ్యయంతో నూతన క్రీడా మైదానాలను ఏర్పాటు చేసేందుకు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ సహకారం అందిస్తునట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామిణ ప్రాంతాల నుండి వివిధ క్రీడల్లో ప్రావిణ్యం కలిగిన క్రీడాకారులను ఎంపీక చేసి వారిని నాగార్జున యూనివర్సిటీలో జాతీయ,అంతర్జాతీయ పోటిలకు ఎంపిక అయ్యే విధంగా ప్రత్యెక శిక్షణను ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రణాళికను ఏర్పాటు చేయటం జరిగిందని ఆయన పేర్కొన్నారు.పీపీపీ స్కీం కింద బీఆర్ స్టేడియం క్రీడా మైదానాన్ని 150 నుండి 200  కొట్ల రూపాయల నిధులతో అభివృధి చేసేందుకు టెండర్లను పిలవటం జరిగిందని ఈ క్రీడా మైదానం అభివృధికి ఆస్త్రేలియాకు చెందిన ఒక సంస్థ వారు ముందుకు రావటం జరిగిందని ఈ అభివృధి కార్యక్రమానికి ఒక కమిటిని ఏర్పాటు చేసి దానికి నగరపాలక కమిషనర్ టక్కర్ ను ప్రత్యెక అధికారిగా నియమించినట్లు ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ గుంటూరు లో ఒక  అకాడమిని నెలకొల్పాల్సిన అవసరం ఉందని జాతీయ, అంతర్జాతీయ క్రీడాపోటిలలో గుంటూరు నగర విశిష్టతను చాటి చెప్పిన క్రీడాకారులు మన గుంటూరులో ఉండటం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. టోర్నమెంట్ కార్యనిర్వాహక కమిటి అధ్యక్షులు రాయపాటి రంగారావు మాట్లాడుతూ అంతర్జాతీయ క్రీడల్లో క్రికెట్ తర్వాత షటిల్ బాడ్మింటన్ 2వ స్థానంలో ఉందని, మన గుంటూరుకు చెందిన కిదాంబి శ్రీకాంత్ ప్రపంచంలో మొదటి ర్యాంక్ లో నిలవటం శ్రీకాంత్ ఈ ఎన్టీఅర్ స్టేడియం నుండే శిక్షణ పొంది గుంటూరు ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలపటం తమకెంతో గర్వకారణమని ఆయన అన్నారు. ఈ టోర్నమెంట్ లో గెలుపొందిన కొంతమంది క్రీడాకారులను ఎంపిక చేసి అంతర్జాతీయ స్థాయిలో జరిగే క్రీడలకు పంపటానికి బెంగళూరులో BAI ద్వారా శిక్షణకు పంపనునట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలోనే గచ్చిబౌలి స్టేడియంను అంతర్జాతీయ స్థాయిలో అభివృధి చేయటం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో SAAP చైర్మన్ మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సాహించే విధంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ క్రీడల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున సహయ సహకారాలు అందజేయటం జరుగుతుందని ఆయన అన్నారు. ప్రపంచంలోని చైనా, కొరియా, మలేషియా వంటి వివిధ దేశాల నుండి ఈ షటిల్ బాడ్మింటన్ అంతర్జాతీయ క్రీడా పోటిలకు మొత్తం 15 మందిలో భారతదేశ, ఆంధ్ర రాష్ట్రం నుండే 5మంది క్రీడాకారులు వెళ్ళటం గొప్ప విశషం అని ఆయన అన్నారు.

గురువారం నాడు జరిగిన మెయిన్ డ్రా లో మొత్తం 96 మ్యాచ్లు నాలుగు విభాగాలుగా నిర్వహించటం జరిగింది. ఈ మ్యాచ్లో 

1. బాయ్స్ సింగిల్ మ్యాచ్లో  64 మంది ఆడగా అందులో 32 మంది  గెలుపొందారని 2. గర్ల్స్ సింగిల్స్ లో 64 మంది ఆడగా అందులో 32 మంది గెలుపొందారని, 3. బాయ్స్ డబుల్స్ లో 32 మంది ఆడగా 16మంది గెలుపొందారని, 4. గర్ల్స్  డబుల్స్ లో 32 మంది ఆడగా 16మంది గెలుపొందారని గురువారం నాడు గెలుపొందిన విజేతలు 5వ తారీఖు నాడు జరిగే సెండ్&థర్డ్ రౌండ్లలో ఛాలెంజ్ మ్యాచ్లో తలపడనున్నారు.  ఈ కార్యక్రమంలో BAI వైస్ ప్రెసిడెంట్ పున్నయ్య చౌదరి, కార్య నిర్వాహక కమిటీ సెక్రెటరీ దామచర్ల శ్రీనివాసరావు,apba కోశాధికారి సంపత్ కుమార్, కార్యనిర్వాహక కమిటి సభ్యులు పాల్గొన్నారు.

 

 

 

Comments

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Post Your Article

రిలెటెడ్