Connect with us

కేసీఆర్ పై మంత్రి నక్కా ఆనంద్ బాబు తీవ్ర వ్యాఖ్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఏపీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌కు సిగ్గులేదని... ఆయన వంటి నీచుడు రాజకీయాల్లో ఉండరని మండిపడ్డారు. పోటుగాడు తన్నుకోవడానికి వస్తాడా ? రమ్మనండి అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణలోని యువతను చంద్రబాబు ఊచకోత కోస్తే... 2009లో చంద్రబాబుతో పొత్తు ఎందుకు పెట్టుకున్నావని కేసీఆర్‌ను ప్రశ్నించారు. 

హైదరాబాద్ కేసీఆర్ అబ్బ సొత్తు కాదన్న మంత్రి నక్కా ఆనందబాబు... తమకు కూడా హైదరాబాద్‌పై పదేళ్లు హక్కు ఉందని స్పష్టం చేశారు. కేసీఆర్ చేసింది దొంగ దీక్ష అని... తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సే అని మంత్రి వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబం సోనియా కాళ్లు నొక్కారని ఆరోపించారు. తన పట్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తిని కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్‌ తమపై విమర్శలు చేస్తున్నారని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఐటీ దాడులపై స్పందించిన మంత్రి ఆనందబాబు... తాము ఎలాంటి తప్పు చేయలేదని... ఐటీ దాడులకు భయపడబోమని అన్నారు.

Comments

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Post Your Article

రిలెటెడ్