Connect with us

ఐపీఎల్‌ ఓవర్‌ రేట్‌‌ నియమావళి అతిక్రమణకు రూ.12లక్షల జరిమానా ..!!

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సారథి విరాట్‌ కోహ్లీకి ఐపీఎల్ రూ.12లక్షల జరిమానా విధించింది. టోర్నీలో భాగంగా బుధవారం బెంగళూరు వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు-చెన్నై సూపర్‌కింగ్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 206 పరుగుల కొండంత లక్ష్యాన్ని చెన్నై ఊదేసింది.

ఈ మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిర్ణీత సమయానికి ఓవర్లు వేయలేకపోవడంతో ఈ జట్టు సారథి విరాట్‌ కోహ్లీకి రూ.12లక్షల జరిమానా విధించింది. ‘ఆర్‌సీబీ జట్టు ఐపీఎల్‌ ఓవర్‌ రేట్‌‌ నియమావళిని అతిక్రమించింది. ఇలా చేయడం ఈ జట్టుకు ఇదే తొలిసారి. ఈ కారణంగానే ఆ జట్టు సారథి విరాట్‌ కోహ్లీకి రూ.12లక్షల జరిమానా విధిస్తున్నాం’ అని ఐపీఎల్‌ నిర్వాహకులు మీడియాకు లేఖ విడుదల చేశారు.

మహేంద్ర సింగ్‌ ధోనీ, అంబటి రాయుడు వీరోచిత ఇన్నింగ్స్‌లతో చెన్నైకు విజయాన్ని అందించారు. ఆర్‌సీబీకి ఈ టోర్నీలో ఇది నాలుగో పరాజయం. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడగా కేవలం రెండింట్లోనే విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. టోర్నీలో భాగంగా ఆర్‌సీబీ తదుపరి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఢీకొట్టనుంది.

Comments

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Post Your Article

రిలెటెడ్