Connect with us

బీసీసీఐ కి షాక్ ఇచ్చిన లా కమిషన్...!! 

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి లా కమిషన్ షాక్ ఇచ్చింది. బీసీసీఐ (దాని అనుబంధ క్రికెట్ సంఘాలు)ని జాతీయ క్రీడా సమాఖ్యగా గుర్తిస్తూ కచ్చితంగా సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి.. కమిషన్ బుధవారం సిఫారసు చేసింది. వాస్తవానికి బీసీసీఐని ఆర్‌టీఐ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్ ఇప్పటిదికాదు. రాష్ట్ర సంఘాల మధ్య తలెత్తే విభేదాలు, నిధుల పంపిణీలో అవినీతి, ఆటగాళ్ల ఎంపికపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చినప్పుడు మాత్రమే దీనిని ఓ అస్త్రంగా ఉపయోగించేవారు. సమస్య సద్దుమణిగాక దీని జోలికి ఎవరూ పోయేవారు కాదు. దీనికితోడు తాము ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదని అలాంటప్పుడు ఆర్‌టీఐ పరిధిలోకి ఎలా వస్తామని చాలా మంది పెద్దలు ఎదురు వాదించేవారు. అయితే స్పాట్ ఫిక్సింగ్ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆర్‌టీఐ అంశంపై ఎక్కువగా దృష్టిపెట్టింది. కేసు విచారణలో భాగంగా రకరకాల అంశాలను పరిగణనలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం బీసీసీఐని ఆర్‌టీఐ పరిధిలో తీసుకువచ్చేందుకు చట్టపరమైన విధానాన్ని రూపొందించాలని 2016లో లా కమిషన్‌ను ఆదేశించింది. 

లా కమిషన్ సిఫారసులను కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే.. బీసీసీఐలో జరిగే ప్రతి పనిని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. జట్ల ఎంపిక, రాష్ర్టాలకు మ్యాచ్‌లు కేటాయించడం, జోన్ల విషయంలో తేడాలు, బోర్డు అధికారుల పనితీరుపై కోర్టులో పిల్ దాఖలు చేయొచ్చు. సెలెక్షన్ కమిటీ పనితీరు, ఆటగాళ్లతో కుదుర్చుకునే ఒప్పందాలు, ఐపీఎల్ టీమ్‌ల కేటాయింపులు, ప్రసార హక్కుల్లో పారదర్శకత, స్టేడియాల భూకేటాయింపులు చెల్లింపులు, బీసీసీఐకి రాష్ర్టాలకు మధ్య జరిగే ఆర్థిక లావాదేవీలను కూడా కూలంకషంగా పరిశీలించొచ్చు. 

ప్రస్తుతం లా కమిషన్ సిఫారసులు మాత్రమే చేసిందని, ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూస్తామంటూ బీసీసీఐ అధికారి ఒకరు ఈ అంశంపై స్పందించారు. ఈ అంశంలో బీసీసీఐ పాత్ర లేదు. కేవలం లా కమిషన్ ప్రతిపాదనలు మాత్రమే చేసింది. నాకు తెలిసినంతవరకు పార్లమెంట్ నిర్ణయం తీసుకునే వరకు లా కమిషన్ ప్రతిపాదనలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏం జరుగుతుందో వేచి చూడాలి. 

Comments

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Post Your Article

రిలెటెడ్