Connect with us

కొత్త తరంను తీవ్ర నిరాశకు గురిచేయనున్న కామన్వెల్త్ క్రీడలు...!!  

వచ్చే కామన్వెల్త్ క్రీడల విభాగం నుంచి షూటింగ్‌ను తొలగిస్తే అది భారత యువ షూటర్లపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని గోల్డ్‌కోస్ట్ స్వర్ణపతక విజేత జీతూరాయ్ చెప్పాడు. కామన్వెల్త్‌లో 10మీ ఎయిర్ పిస్టల్ విభాగంలో పసిడి పతకం సాధించిన జీతూను బుధవారం జరిగిన కార్యక్రమంలో భారత ఆర్మీ అభినందించింది.మానెక్‌షా సెంటర్ (ఆర్మీ సెంటర్)లో ఏర్పాటు చేసిన సత్కార కార్యక్రమంలో జీతూతో పాటు మరో షూటర్ ఓం ప్రకాశ్ సైనిక బలగాలతో తమ అనుభవాలను పంచుకున్నారు. షూటింగ్‌లో భారత్ 16 పతకాలు సాధించడం సంతోషంగా ఉందని జీతూ తెలిపాడు. 2022లో బర్మింగ్‌హామ్‌లో జరుగనున్న కామన్వెల్త్ గేమ్స్‌లో షూటింగ్‌ను తొలగించడంపై స్పందిస్తూ..షూటింగ్‌లో మేము ఎక్కువ పతకాలు గెలుచుకున్నాం. యువ షూటర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. వచ్చే కామన్వెల్త్‌లో షూటింగ్ లేకపోతే కొత్త తరం తీవ్ర నిరాశకు గురవుతుంది. అయితే ఇది ప్రభుత్వానికి, నిర్వాహకులకు సంబంధించిన అంశం. మేము షూటింగ్ మాత్రమే చేయగలం. ఆ క్రీడను మళ్లీ చేర్చుతారనే నమ్మకం ఉన్నది. ఒకవేళ షూటింగ్‌ను తొలగిస్తే కామన్వెల్త్‌ను బహిష్కరించాలన్న జాతీయ రైఫిల్ సంఘం నిర్ణయానికే నా మద్దతు అని జీతూ అన్నాడు.

Comments

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Post Your Article

రిలెటెడ్