Connect with us

విలేకరిపై మండిపడ్డ క్రికెటర్ కేఎల్ రాహుల్...!!

ధోని ఫామ్ గురించి ప్రశ్నించిన విలేకరిపై క్రికెటర్ కేఎల్ రాహుల్ మండిపడ్డారు. "ధోని ఆటను మాత్రమే ఎందుకు ప్రశ్నిస్తున్నారు? ఆయన చేసిన పరుగులు మీరు చూడలేదా? ధోని ఫామ్‌లో లేడని చెప్పడమేంటి?" అంటూ రాహుల్ ప్రశ్నించారు. మాకందరికీ ధోనియే ఆదర్శమని ఈ సందర్భంగా రాహుల్ తెలిపారు.

అంతేకాకుండా భారత జట్టులో మ్యాచ్ విన్నర్లలో ధోని ముందు వరుసలో ఉంటారని చెప్పారు. ప్రతి గేములో ప్రతి ఒక్కరూ రాణించలేరని, కానీ ధోని విషయంలో సరాసరి గణాంకాలు చూసి మాట్లాడాలని హితవు పలికారు. ప్రతి ఇన్నింగ్స్ తమకు ముఖ్యమైనదేనని, అవకాశాలు లభిస్తే, పరుగులు చేసేందుకు ఎవరూ వెనుకాడబోరని స్పష్టం చేశారు.

Comments

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Post Your Article

రిలెటెడ్