Connect with us

కెప్టెన్సీ నుంచి వైదొలిగిన గంభీర్...!!

ఐపీఎల్ పదకొండో సీజన్‌ను ఢిల్లీ టీమ్ మరీ దారుణంగా ప్రారంభించింది. ఆడిన 6 మ్యాచుల్లో ఐదింట్లో ఓడింది. గంభీర్ స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను టీమ్ కెప్టెన్‌గా నియమించింది. ఐపీఎల్ టేబుల్లో అట్టడుగున ఉంది ఢిల్లీ డేర్‌డెవిల్స్. కెప్టెన్‌గానే కాదు బ్యాట్స్‌మన్‌గా కూడా గంభీర్ విఫలమయ్యాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌లో కెప్టెన్‌గా, ప్లేయర్‌గా సక్సెసైన గంభీర్.. అదే ఫామ్‌ను ఢిల్లీ టీమ్‌తో కొనసాగించలేకపోయాడు. ఆరు మ్యాచుల్లో గంభీర్ 85 రన్స్ మాత్రమే చేశాడు. తొలి మ్యాచ్‌లోనే 55 పరుగులతో రాణించాడు.

ఆ తర్వాత ఐదు మ్యాచుల్లో ఘోరంగా విఫలమయ్యాడు. గతంలో 2010లోనూ ఢిల్లీ టీమ్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు గంభీర్. ఆ ఏడాది డేర్‌డెవిల్స్ ఐదోస్థానంతో సరిపెట్టుకున్నారు. ఈ సీజన్‌లో కోల్‌కతా నుంచి ఢిల్లీకి తిరిగి రావడంతో గంభీర్‌పై ఆ టీమ్ భారీ ఆశలు పెట్టుకుంది. అయితే ఆరు మ్యాచులైనా గంభీర్ ప్రభావం ఏమాత్రం లేకపోవడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో కెప్టెన్సీ మార్పు చేయాల్సి వచ్చింది. కెప్టెన్సీ భారం దిగిపోవడంతో గంభీర్ బ్యాట్‌తో రాణిస్తాడని టీమ్ భావిస్తున్నది.

Comments

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Post Your Article

రిలెటెడ్