Connect with us

ఒక్కో మ్యాచ్ కు 6.60 కోట్లు...!! 

ఐపీఎల్ వల్ల ప్రపంచ దేశాల మధ్య జరిగే సంప్రదాయ క్రికెట్ కనుమరుగవుతుందని ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ తెలియజేసారు.  ఐపీఎల్ లో ఆటగాళ్ల కొనుగోలుకు ఫ్రాంఛైజీలకు విధించిన 12 మిలియన్ డాలర్ల నిబంధన ఎత్తేస్తే ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్, ఎన్ఎఫ్ఎల్ మాదిరి క్రికెటర్లు సంపాదించే అవకాశం ఉందని, ఆ తరువాత ఆటగాళ్లకు ఒక్కో మ్యాచ్‌ కు ఒక మిలియన్‌ డాలర్లు (సుమారు 6.60 కోట్ల రూపాయలు) చెల్లించే రోజు వస్తుందని పేర్కొన్నాడు.

ఐపీఎల్‌ ను మరింత విస్తరిస్తే భారత్‌ ను బహిష్కరిస్తామని ఐసీసీ బెదిరింపులకు దిగే అవకాశం కూడా లేకపోలేదని అభిప్రాయపడ్డాడు. ఐతే సొంతకాళ్లపై నిలబడే సత్తా భారత్‌ సొంతమని విశ్వాసం వ్యక్తం చేశాడు. ప్రపంచ క్రికెట్‌తో పోల్చుకుంటే భారత దేశవాళీ క్రికెట్‌ 20 రెట్లు పెద్దదని మోదీ పేర్కొన్నాడు. 

Comments

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Post Your Article

రిలెటెడ్