Connect with us

స్పిన్ త్రయం దెబ్బకు విండీస్ విలవిల

అనుకున్నట్టుగానే వెస్టిండీస్ ను మూడోరోజే ముంచేసారు.భారత్ స్పిన్ త్రయానికి వెస్టిండీస్ దాసోహమైంది.మూడవ రోజు 94/6 తో ప్రారంభించిన వెస్టిండీస్ 181 పరుగులకే ఆలౌటై ఫాలో ఆన్ లో పడింది.
అశ్విన్ 4 వికెట్లు పడగొట్టాడు.కోహ్లీ విండోస్ కు రెండవ ఇన్నింగ్స్ పిలవగా మొదటి ఇన్నింగ్స్ లో 468 పరుగులు వెనుకబడి రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ ఏ దశలోనూ నిలదొక్కుకోలేకపోయింది.స్పిన్ త్రయం ధాటికి విలవిలలాడి 196 పరుగులకే తన రెండవ ఇన్నింగ్స్ ముగించి ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది.భారత్ బౌలింగ్ లో రెండవ ఇన్నింగ్స్ లో కులదీప్ 5 వికెట్లు పడగొట్టాడు. మొత్తం రెండవ ఇన్నింగ్స్ వికెట్లన్నీ స్పిన్నర్లే తీయడం విశేషం.మ్యాచ్ మొత్తం మీద 16 వికెట్లు స్పిన్నర్లే తీసారు.తన తొలి అంతర్జాతీయ టెస్ట్ ఇన్నింగ్స్ లోనే సెంచరీ సాధించిన పృథ్వీ షాను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది.

Comments

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Post Your Article

రిలెటెడ్