Connect with us

ఈసీఐఎల్‌ ట్రేడ్‌మెన్‌ పోస్టుకు ఆదివారం నిర్వహించిన పోటీ పరీక్ష గందరగోళంగా జరిగింది. డీఏఈ కాలనీలోని అటామిక్‌ ఎనర్జీ సెంట్రల్‌ స్కూల్‌ 1, 2తోపాటు వసుంధర డిగ్రీ కళాశాలలో నిర్వహించిన పరీక్ష నిర్ణీత సమయంకంటే అరగంట ఆలస్యంగా జరిగింది. పరీక్ష సమయం గంట ఉండగా గంటన్నరపాటు నిర్వహించారు. సంస్థలో 17 ట్రేడ్‌లలో 40 పోస్టులకుగాను ఇటీవల ఉద్యోగ ప్రకటన చేశారు. ఐటీఐ అర్హతతో 3070 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేశారు. అభ్యర్థుల హాల్‌టికెట్లలో పరీక్ష సమయం ఉదయం 10.30 గంటల నుంచి 11.30 గంటల వరకు ఉండగా ఆరగంట ఆలస్యంగా 11 గంటలకు పరీక్షను ప్రారంభించి 12.30 గంటల వరకు నిర్వహించారు. అరగంట ఆలస్యం, అదనంగా అరగంట సమయాన్ని కేటాయించడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ గందరగోళంపై పర్యవేక్షకులను అభ్యర్థులు ప్రశ్నించగా వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ప్రశ్నలు కఠినంగా ఉన్నాయని..: టెక్నికల్‌ డెరెక్టర్‌ వి.ఎస్‌.బి.బాబు ఈ లోపాలపై ఈసీఐఎల్‌ టెక్నికల్‌ డైరెక్టర్‌ వి.ఎస్‌.బి.బాబును వివరణ కోరగా.. ప్రశ్నలు కఠనంగా ఉన్నాయని అదనపు సమయం కేటాయించాం. అభ్యర్థలను తనిఖీ చేసి కేంద్రాల్లోకి అనుమతించడంలో జాప్యం కారణంగా అరగంట ఆలస్యంగా ప్రారంభించాం.

Comments

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Post Your Article

రిలెటెడ్